Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 2022 డిసెంబర్ నెల జీతాన్ని వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.వెంకటేశ్, జె.కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు పద్మశ్రీ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, హెల్త్, రెవెన్యూ తదితర 36 శాఖల్లో లక్షా నలభై వేల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తు న్నారని తెలిపారు.
వారికి పదో తేదీ దాటినా ఇంకా వేతనం చెల్లించకపోతే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ప్రతినెలా 15 తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. ట్రైబల్ వెల్ఫేర్లోని సిబ్బంది జీతాలు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2022 డిసెంబర్ నెల వేతనం చెల్లించడమే కాకుండా జనవరి నెల నుంచి ఈ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని కోరారు. ఇదే అంశాన్ని జె.వెంకటేశ్, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ యూనియన్ రాష్ట్ర నేత బి. మధు ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.