Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను క్రమబద్ధీ కరించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటూ గతేడాది మార్చి తొమ్మిదిన సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. 80,039 ఖాళీ పోస్టులను కొత్త నియామకాల ద్వారా భర్తీ చేస్తామన్నారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులు రెగ్యులరైజేషన్‌కు సం బంధించిన ప్రక్రియ పూర్తి చేసి సీఎం ఆమోదం కోసం దస్త్రాన్ని అధికారులు సమర్పిం చారని పేర్కొన్నారు. 11,103 మంది ప్రధానంగా మెడి కల్ అండ్ హెల్త్ ఉద్యోగులు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకు లుగా పనిచేస్తున్నారని వివరించారు. రెగ్యులరైజే షన్ ఉత్తర్వుల కోసం వేయి కండ్లతో ఎదురు చూస్తు న్నారని తెలిపారు. రెగ్యులరైజేషన్ ఆలస్యం కావ డం ప్రభుత్వానికి మంచిది కాదని పేర్కొ న్నారు. రెగ్యులరైజేషన్ ఉత్తర్వులను వెంటనే జారీ చేయా లంటూ అధికారులను ఆదేశించాలని కోరారు.