Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ కమిషనర్‌కు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ నుంచి రూ.163కోట్ల సెస్ బకాయిలను వెంటనే రికవరీ చేయాలని, బడా నిర్మాణ సంస్థల నుంచి సెస్ వసూలు చేయాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం లేబర్ కమిషనర్‌కు సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌రావు, ఎం.దశరథ్‌తో కలిసి వినతిపత్రం అందజేశారు. పత్రంలోని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మెట్రోరైలును నిర్మించి, నిర్వహిస్తున్న ఎల్అండ్టీ సంస్థ కార్మిక శాఖకు చెల్లించాల్సిన రూ.163కోట్ల లేబర్ సెస్‌ను ఎగవేసింది. 2014లోనే సెస్ చెల్లించాలని కార్మికశాఖ అధికారులు ఎల్అండ్టీ సంస్థకు నోటీసులు జారీచేసినా చెల్లించలేదు. సెస్ చెల్లింపు గురించి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న ఎల్అండ్టీ సంస్థకు కార్మికశాఖ అధికారులు వత్తాసు పలికారు. 2019 వరకు హైకోర్టులో కనీసం అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. సీపీఐ(ఎం) నగర కమిటీ ఫిర్యాదుతో ఇటీవల కోర్టులో కౌంటర్ వేసినప్పటికీ సెస్ వసూలుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎల్అండ్టీ సంస్థకు మూడు వారాలే స్టే ఇచ్చినప్పటికీ స్టే ఉందనే పేరుతో అధికారులు సెస్ వసూలుకు పూనుకోలేదు. సెస్ చట్టం ప్రకారం ప్రతి బకాయిపైనా నెలకు రెండు శాతం చొప్పున వడ్డీ వసూలు చేయాల్సి ఉంటుంది. రూ.163కోట్లకు వడ్డీతో కలిపి తక్షణమే ఎల్అండ్టీ నుంచి రికవరీ చేయడానికి చర్యలు ప్రారంభించాలి. మెట్రోరైలు నిర్మాణానికి వ్యయం పెరగడంతో మొత్తం వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ఒక శాతం చొప్పున సెస్ వసూలు చేయాలి. ఎల్అండ్టీ సెస్ ఎగవేతకు బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. విజిలెన్స్ శాఖ చేసిన సిపార్సులను అమలు చేయాలి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని అనేక బడా నిర్మాణ సంస్థలు 2014 నుంచి 2020 వరకు సెస్ చెల్లించలేదు. సెస్ వసూలు చేసే బాధ్యతా జీహెచ్‌ఎంసీదా? కార్మిక శాఖదా? అనే వివాదంతో ఇంతరకు వసూలు చేయలేదు. సీపీఐ(ఎం) చేసిన ఆందోళనతో 2020కి ముందు సెస్ చెల్లించని సంస్థలు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నింటి నుంచి సెస్ వ సూలుకు చర్యలు ప్రారంభించాలని పేర్కొన్నారు.