Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదుపుతప్పి కాల్వలో బోల్తాకొట్టిన కారు
నవతెలంగాణ-జగదేవపూర్
కారు అదుపుతప్పి కల్వర్టును ఢకొీట్టి పక్కనే గల కాల్వలో పడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడప గ్రామంలో జరిగింది. సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ కృష్ణమూర్తి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బీబీనగరర్, బొమ్మల రామారానికి చెందిన ఆల్టో కారు ఏపీ 29 బీడీ 4538లో బోల్లు సమ్మయ్య, బొల్లు స్రవంతి, రాజమణి, భవ్యశ్రీ, లోకేష్, వెంకటేష్ వేములవాడ వెళ్లి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది .దాంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో బోల్లు సమ్మయ్య(40), బొల్లు స్రవంతి(32), రాజమణి(48), భవ్యశ్రీ(15), లోకేష్(12) అక్కడికక్కడే మృతి చెందారు.