Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి : కేవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బహుజన కవి, వాగ్గేయకారుడు రెంజర్ల రాజేష్ కుటుంబంపై భౌతిక దాడులకు పాల్పడిన మతోన్మాద దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెేవీపీఎస్) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ టి స్కైలాబ్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. అయ్యప్ప స్వాముల ముసుగులో వచ్చిన ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, బీజేపీ పరివారం రెంజర్ల రాజేశ్ ఇంటిపై దాడి చేసి, అతని కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేసిందని తెలిపారు. రాజేశ్‌ను ముక్కలు ముక్కలుగా నరుకుతామంటూ, కుటుంబాన్ని తగలబెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మహిళలపై దౌర్జన్యం చేశారని తెలిపారు. తక్షణమే రాజేశ్ కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దౌర్జన్యానికి పాల్పడిన మతోన్మాద దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.