Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శికి ఎస్ఎఫ్ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థుల పరీక్షలకు సంబంధించి మరింత ఛాయిస్ ఇవ్వాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వ్యాసరూప ప్రశ్నల్లో సెక్షన్ల వారీగా ఛాయిస్ ఇవ్వాలని కోరింది. ఈ పరీక్షలు రోజు విడిచి రోజు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణను మంగళవారం హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, సహాయ కార్యదర్శి కె అశోక్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు లెనిన్గువేరా కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు సూక్ష్మ ప్రశ్నలకు 30 శాతం ఛాయిస్ పెంచాలని వారు ఈ సంద ర్భంగా డిమాండ్ చేశారు. వ్యాసరూప ప్రశ్నలకు సెక్షన్ల వారీగా ఛాయిస్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుత పదో తరగతి విద్యార్థులు కరోనా కారణంగా అభ్యసనకు సరైన పరిస్థితుల్లేవనీ, ఇలాంటి తరు ణంలో ఈ విధానంలో ఛాయిస్ లేకుండా పరీక్షలు నిర్వహిస్తే సిలబస్ మొత్తం పరీక్షలు రాయడానికి సమయం సరిపో దని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం ఛాయిస్ ఇచ్చి విద్యార్థులు నష్టపోకుండా చూడాలని కోరారు.