Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు కనీసవేతనం కోసం కొట్లాడుతాం
- అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించాలి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- అఖిల భారత మహాసభల నేపథ్యంలో సీఐటీయూ జెండాఎగురవేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశాభివృద్ధికి ఆటంకంగా మారిన విచ్ఛిన్నకరశక్తుల ఎత్తుగడలను తిప్పికొడతామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాల కోసం కొట్లాడుతామన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ యూనియన్ అఖిల భారత మహా సభలను పురస్కరించుకుని అరుణపతాకాన్ని ఆయన ఎగుర వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఐటీయూ అఖిల భారత మహాసభలు బెంగుళూరులో ఈ నెల 18 నుంచి 22 వరకు జరుగబోతున్నాయనీ, వాటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మతోన్మాద శక్తులు, కార్పొరేట్ శక్తులు దేశాన్ని దివాళా తీయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, దేశ ఆర్థిక సార్వ భౌమత్వాన్ని కాపాడుకునేందుకు కార్మికులను రాజకీయంగా చైతన్యపరిచి పోరాటాలు చేస్తామన్నారు. దేశంలో శాంతిని నెలకొల్పేం దుకు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ముందుకు సాగుతామని చెప్పారు. సమాజమార్పు, దోపిడీ అంతానికి సీఐటీయూ ఎల్ల వేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఏప్రిల్ ఐదో తేదీన కార్మి కులు-వ్యవసాయ కూలీలు-రైతులు సంయుక్తంగా తల పెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయా లని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపా ధ్యక్షులు ఎస్వీ.రమ, రాష్ట్ర కార్యదర్శి మధు, వర్కింగ్ కమిటీ సభ్యులు ఆర్.కోటంరాజు, కె.సోమన్న, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, ఎ.సునీత, తదితరులు పాల్గొన్నారు.