Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
స్వామి వివేకానంద జయంతి నేపథ్యంలో నిర్వహించిన జానపద కళాకారుల శోభాయాత్ర ఆకట్టుకుంది. భారత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు స్వామి వివేకానంద 160వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యపార్కు వద్ద శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రను అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకరస్వామి ప్రారంభించి.. వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శోభాయాత్రలో భాగంగా కోలాటం, హరికథలను కళాకారులు ప్రదర్శించారు. అవి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షులు కొండూరి భాస్కర్, సహాయ కార్యదర్శి ఎంజే వినోద్‌కుమార్, పీఎన్ మూర్తి, కుమ్మరి శంకర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.