Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
ఎల్ రమణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్‌కు కేంద్రంనిధులు ఇస్తామని వాగ్దానం చేసిందనీ, ఇప్పటికీ నిధులు కేటాయించలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 18వేల మగ్గాలను గుర్తించి, చేనేత రంగానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. కరోనా సమయంలో చేనేత కార్మికులకు దాదాపు వంద కోట్లు ఇచ్చారని తెలిపారు. చేనేత రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మహారాష్ట్ర అధికారులు వచ్చి తెలుసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ రంగానికి 10 శాతం జీఎస్టీ విధించారని విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మళ్ళీ చేనేతపై ఐదుశాతానికి తగ్గించారని గుర్తు చేశారు. చేనేతపై జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పోరాటం చేసిందని తెలిపారు. తెలంగాణలో జనపనార బోర్డు రద్దు
తెలంగాణ రాష్ట్రంలో జనపనార బోర్డు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నై, బెంగుళూరు నగరాల్లోని బోర్డులను పశ్చిమ బెంగాల్ జనపనార బోర్డులో విలీనం చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.