Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యామండలి చైర్మెన్‌కు టీఎస్టీసీఈఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న ప్రయివేటు విశ్వవిద్యాలయాలపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని టీఎస్టీసీఈఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రిని బుధవారం హైదరాబాద్‌లో టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్‌ను వారు ఆవిష్కరించారు. గుర్తింపు లేకున్నా గురునానక్, శ్రీనిధి విశ్వవిద్యాలయాలు అడ్మిషన్లు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీసీఈఏ నాయకులు డి శ్రీనివాస్, బి అనంతరామ్, శ్రీనివాస్, పురుషోత్తం, శ్రీనివాస్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.