Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూల్ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని సంఘాల తీర్మానం
- ఐదేండ్లుగా విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ శాఖలో ఉద్యోగులకు 'పదోన్నతులు లేవు, బదిలీలు లేవు, కొత్త నియామకాలు లేవు' అని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, కొత్త మండలాలకు రెవెన్యూ శాఖ ఉద్యోగులను నియమించింది. వాటికి ఇప్పటికీ వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులను నియమించలేదు. ఉన్న ఉద్యోగులతోనే పని చేస్తున్నది. వ్యవసాయ శాఖలో దాదాపు 1200 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 70శాతం మంది ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక తరగతులకు చెందిన వారే ఉన్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. టైమ్ టు టైమ్ పదోన్నతులు ఇవ్వకపోవడంతో ఆ తరగతులకు చెందిన ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. రెండు అదనపు డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడం లేదు. అంతేకాకుండా డైరెక్టు రిక్రూట్మెంట్ అయిన వారికి ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎంతో సీనియార్టీ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులకు నష్టం జరుగుతున్నది. తనకు కేటాయించిన శాఖకు సంబంధించిన ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి... వారికి నిద్రలేకుండా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మంత్రి అండదండలతోనే తమకు ప్రమోషన్లు ఆగిపోతున్నా యంటూ పలువురు అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి సంబంధికులైన ఒకరిద్దరికి (డైరెక్టు రిక్రూట్మెంట్ అయిన) ప్రమోషన్లు ఇచ్చేం దుకు, మిగతా ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా బ్రేకులు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత ఐదేండ్లుగా వ్యవసాయ శాఖలో ఇదే జరుగుతున్నది. వారికి ప్రమోషన్లు, బదిలీలు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం ఆలస్యం ఈ విధంగా చేయడంమేగాక ఉద్యోగ సంఘాల మధ్య కిరికిరితోనే ప్రమోషన్లు ఆగిపోతు న్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన రెండు ఉద్యోగ సంఘాలు రూల్ ప్రకారం ప్రయోషన్లు, బదిలీ చేయాలంటూ కామన్ తీర్మానం చేశాయి. ఆ తీర్మానాన్ని మంత్రికి, వ్యవసాయ కమిషనర్ విన్నవించినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టినట్టు ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులను బదిలీ చేసేందుకు జీవోలు ఉన్నప్పటికీ ఆ జీవోను తుంగలో తొక్కుతున్నారనే ఆవేదన వ్యక్తమవుతున్నది. దీంతో వ్యవసాయ అప్గ్రేడేషన్ ప్రక్రియ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో నియమితులైన ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సీనియారిటీ జాబితాలో ఉన్న వారిని పట్టించుకోవడం లేదని పలువురు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పదోన్నతుల ప్రక్రియలో అడ్డంకులు సష్టిస్తున్నారనీ, ఏడీఏ పోస్టు ఖాళీగా ఉన్నందున సీనియారిటీని లెక్కించి అమలు చేయాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్ల నిబంధ నల ప్రకారం పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వారు కోరుతున్నారు.