Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతదేశ ఉపాధ్యాయులు త్వరలో గ్లోబల్ గురువులవుతారని బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. అభ్యాస ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా ఐదో స్థానంలో ఉందని తెలిపారు. అలాంటి వైభవం తేవడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని తెలిపారు. భారతదేశాన్ని గొప్పగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభ్యాస సీఈవో, వ్యవస్థాపక డైరెక్టర్ కళ్లెట్ల వినాయక తదితరులు పాల్గొన్నారు.