Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేటీబీఎస్, ఏటీవీఎంలు కూడా అందుబాటులోకి
- సిబ్బందినీ పెంచాం : దక్షిణ మధ్య రైల్వే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామనీ, అన్రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణించాలనుకునేవారు తమ స్మార్ట్ ఫోన్లలో కూడా యూటీఎస్ యాప్ ద్వారా టికెట్లు పొందవచ్చునని దక్షణి మధ్య రైల్వే వెల్లడించింది. గురువారం ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. జనసాధరన్ టిక్కెట్ బుకింగ్ సేవక్స్ (జేటీబీఎస్), ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్ల (ఏటీవీఎం) ద్వారా కూడా టిక్కెట్లు పొందవచ్చునని సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బుకింగ్ కౌంటర్ల సంఖ్యను 12 నుండి 21కి పెంచినట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు సరైన రైళ్లలో ఎక్కేలా చూసేందుకు పాయింట్ టూ పాయింట్ సమాచారాన్ని అందించడంలో భాగంగా స్టేషన్ టికెట్ తనిఖీ సిబ్బంది సంఖ్యను 20 నుంచి 40కి పెంచినట్టు తెలిపారు. రెగ్యులర్ ప్రాతిపదికన 30 ఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు స్టేషన్ ఆవరణలో మరో 30 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. టీఐబీ, సీబీఐలపై తరచుగా ప్రకటనలు, సమాచారాన్ని ప్రదర్శించడం, వెయిటింగ్ హాళ్ల వద్ద శుభ్రత, చెల్లింపు, వినియోగ సౌకర్యాలు, అత్యవసర సమయాల్లో వైద్యం అందించే ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.