Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయి : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆరేడుసార్లు ఓడిపోయిన వాళ్లున్న రాజకీయ సలహా కమిటీ (పీఏసీ)లో నేను కూర్చోవాలా? అని ఎంపీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. ఏఐసీసీ తనకు ఇచ్చిన షాకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని తెలిపారు. గురువారం హైదరాబాద్లో మాణిక్రావు ఠాక్రేతో భేటీ అయిన ఆ తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. పీసీసీ కొత్త కమిటీలను తాను పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. బుధవారం నియోజకవర్గ పర్యటనల వల్ల ఠాక్రేను కలవలేకపోయానన్నారు. ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి తదితరులు ఆయన్ను ఎందుకు కలవలేదో అడగాలంటూ సూచించారు. కొన్నిసార్లు నియోజకవర్గం పనులతో కలవలేమన్నారు. తమ ఫోటోలను మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోవడంలేదనీ, తన ఫోటో మార్ఫింగ్ అయిందని స్వయానా పోలీస్ కమిషనరే తనకు చెప్పారని గుర్తు చేశారు. కొత్త ఇంచార్జి తనకు కొత్త కాదనీ, పాత పరిచయమేనని వ్యాఖ్యానించారు.