Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్తు భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శి ఆజాద్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఆర్పీఎఫ్, గ్రెేహాౌండ్స్ దళాలు ఆదివాసులపై దాడులకు దిగుతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సరిహద్దుల్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్లో మావోయిస్టు నేత హిడ్మా మరణించినట్టు ఇరు రాష్ట్రాల పోలీసులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది వాస్తవం కాదని తెలిపారు. దేశాల సరిహద్దుల్లో భధ్రత కోసం పనిచేయాల్సిన సైన్యం..ఛత్తీజ్ఘడ్ అడవుల్లో ప్రతి నాలుగు ఊళ్లకు ఒక క్యాంపును నిర్వహిస్తూ ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీని ప్రజల నుంచి వేరు చేసేందుకు మోడీ ప్రభుత్వం తాపత్రయ పడుతుందని తెలిపారు. దండకారణ్యంలో ఏర్పాటు చేసిన సైన్యాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.