Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హార్ట్ ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (హెచ్ఇటి), ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో మూడు రోజుల ఆగ్రో యూత్ సమ్మిట్ గురువారం ప్రారంభమైంది. హైదరాబాద్ శివారుల్లోని హార్ట్ ఫుల్ నెస్ ప్రధాన కేంద్రంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్.సీ.అగర్వాల్, హార్ట్ ఫుల్ నెస్ వరల్డ్ వైడ్ గైడ్ కమలేష్ పటేల్ దాజీ పాల్గొన్నారు. హార్ట్ ఫుల్ క్యాంపస్ డైరెక్టర్ రమేశ్ క్రిష్ణన్, సమ్మిట్ కన్వీనర్ డాక్టర్ నివేదిత శ్రేయాన్స్, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, విద్యావేత్తలు, బోధనా సిబ్బంది సమ్మిట్‌లో భాగస్వాములయ్యారు. దేశంలో రెండు లక్షల మంది విద్యార్థులు వ్యవసాయ విద్యను అభ్యసిస్తుండగా, వారికి సహాయ పడేందుకు వీలుగా హెచ్ఇటి, ఐసీఏఆర్ మధ్య గతేడాది ఆగస్టులో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మూడు రోజుల సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు.