Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో 2017-2018 బ్యాచ్ బీడీఎస్ విద్యార్థులకు నీట్ ఎండీఎస్-2023 పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ మంజూర్ ఆహ్మద్ వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు లేఖ రాశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యం కావడంతో ఈ బ్యాంచ్ చివరి సంవత్సరం పరీక్ష లను 2022 జనవరి 19 నుంచి ఫిబ్రవరి 19 వరకు నిర్వహించారని గుర్తుచేశారు. వారి ఫలితాలను అదే ఏడా ది ఏప్రిల్ 11న ప్రకటించడంతో ఇంటర్న్‌షిప్ ఏప్రిల్ 12న మొదలై ఈ ఏడాది ఏప్రిల్ 11న ముగియనున్నదని తెలిపారు. అయితే నీట్ ఎండీఎస్ 2023 పరీక్ష రాసేం దుకు వీలుగా ఇంటర్న్ షిప్ మార్చి 31తో ముగించి ఉం డాలని నిబంధన పెట్టారని తెలిపారు. దీంతో రాష్ట్రం లో ఈ బ్యాచ్‌కు సంబంధించిన దాదాపు వెయ్యి మందికి పైగా బీడీఎస్ విద్యార్థులు ఎండీఎస్ రాసే అర్హత కోల్పోతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి న్యాయం చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలను తీసుకోవాలని కోరారు.