Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 17ను రద్దు చేయాలి
- ఈ నెల 30న కలెక్టరేట్ల ముందు ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో ధర్నాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదాయ పరిమితి విధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లను కుధించేందుకు తీసుకొచ్చిన జీవో 17ను వెంటనే రద్దు చేయాలని వికలాంగుల జాతీయ హక్కుల వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకట్, ఎం అడివయ్య ఒక ప్రకటనలో ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. గురు వారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటి సమావేశాన్ని నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ పరికరాలు, రుణాలు అందించాలని కోరారు. పెండింగ్లో ఉన్న వివాహ ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల్లో వికలాం గులకు మొదటి ప్రధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 2014లో జీవో 17 విడుదల చేసిందనీ, దాన్ని 2022 అక్టోబర్ నుండి ప్రభుత్వం అమలు చేయడం ద్వారా అర్హులైన అనేకమంది లబ్ధి దారుల పింఛన్లు రద్దు అయ్యాయని తెలిపారు. పెన్షన్ల మీద ఆధారపడిన వికలాంగులు వృద్ధులు, ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని తెలిపారు. రద్దు చేసిన పింఛన్లను వెంటనే పునరు ద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికలాంగుల వివాహ ప్రోత్సాహకానికి సంబంధించిన వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్యాయని గుర్తుచేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లకు నిధులు విడుదల చేసినట్టుగానే వికలాంగుల వివాహ ప్రోత్సాహాకానికి కూడా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 2020-21, 2021-2022, ఆర్థిక సంవత్సరం ముగుస్తు న్నప్పటికీ స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరు చేయడం లేదని తెలి పారు. బ్యాంకు లింకేజి లేనటువంటి రూ.50వేల రుణాలను మాత్రమే పంపిణీ చేసీ, బ్యాంకు లింక్ చేసిన టువంటి రుణాలను మంజూరు చేయడం లేదని తెలి పారు. వేలాది మంది దరఖాస్తు దారులు బ్యాంకుల చుట్టూ తిరుగు తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వలన నిరుద్యోగ వికలాం గులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొం టున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. చదువుతో నిమిత్తం లేకుండా వైకల్య తీవ్రతను బట్టి దర ఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి మోటర్ వెహికల్స్ ఇవ్వాలని డిమాం డ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక టీచర్లను నియమించే విధం గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కు ల పరిరక్షణ చట్టం ప్రకారం గుర్తిం చిన 21 రకాల వైకల్యాలకు ధ్రువీక రణ పత్రాలను తక్షణమే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో స్పీచ్, హియరిం గ్ క్లినిక్లు పుట్ట గొడుగుల్ల పుట్టుకొ స్తున్నాయని తెలిపారు. వాటిపైన ప్రభుత్వ నియంత్రణ లేక పోవడం వలన ప్రతి నెల ఒక్కొక్క పేషెంట్ నుండి రూ.30 వేల నుండి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తు న్నాయని పేర్కొన్నారు.