Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి తెలంగాణ సర్కార్ అండగా నిలిచింది. మంత్రి కేటీఆర్ చొరవతో ప్రభాకర్ కుటుంబ సభ్యుల కు భరోసా అందింది. పేదోడి బాధను, సమాజంలోని అసమానత లను అక్షరీకరించిన అలిశెట్టి జయంతి, వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ పరిస్థితి గురించి పలువురు కేటీఆర్ దృష్టికి తీసుకుచ్చారు. దీంతో అలిశెట్టి కుటుంబ సభ్యులతో వెంటనే మాట్లాడాలంటూ మంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశిం చారు. ఆయన ఆదేశాలతో అలిశెట్టి భార్య భాగ్యతో మాట్లాడిన అధికారులు, వాళ్ల అభిప్రాయాన్ని తెలుసుకుని మంత్రి కి తెలి యజేశారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి, సొంతింటిని నిర్మించి ఇచ్చే విషయంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.