Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంతంగి టోల్గేట్ వద్ద వాహనాల బారులు
నవతెలంగాణ-చౌటుప్పల్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో జాతీయ రహదారులు రద్దీగా మారాయి. గురువారం నుంచే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి జనం సొంతూళ్లకు పయనమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజా రవాణాతోపాటు వ్యక్తిగత వాహనాలు పెద్దఎత్తున రోడ్డెక్కడంతో హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై పంతంగి టోల్ గేట్ వద్ద రద్దీ భారీగా పెరిగింది.