Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష విద్యార్థి,యువజన సంఘాలు
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఈనెల 22న నిర్వహించే విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా, ఆయన మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫోనియా గువేరాల సభను విజయవంతం చేయాలంటూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రదీప్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి నాగరాజు, టి రవి, ప్రవీణ్ (ఎస్ఎఫ్ఐ), ఆనగంంటి వెంకటేష్ (డీవైఎఫ్ఐ), పి లక్షణ్, కె మణికంఠ, రెహమాన్ (ఏఐఎస్ఎఫ్), ధర్మేంద్ర (ఏఐవైఎఫ్), మహేష్, తిరుపతి, శ్రీను (పీడీఎస్యూ), జ్వాలా (ఏఐపీఎస్యూ), ఆజాద్, రామకృష్ణ (పీడీఎస్యూ), వెంకటేష్ (ఏఐడీఎస్ఓ), పరుశురాం (పీడీఎస్యూ) పాల్గొన్నారు. అనంతరం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.