Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నిస్థానాల్లోనూ పోటీచేస్తాం
- టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సాధారణ ఎన్నికల్లో బీసీలకే తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. అదే విధానంతో పార్టీ పున:నిర్మాణం చేయనున్నట్టు ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్భవన్లో మీడియాతో మాట్లాడారు. తొలుత నాటూ బ్రహ్మాణ తరగతికే టికెట్లు ఇస్తామని అన్నారు. ఆయా కుల సంఘాలు ఏకక్రీవంగా ప్రతిపాదించిన వారికి సైతం పార్టీ టికెట్లు ఇవ్వనున్నట్టు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తామని ప్రకటించారు. త్వరలో పార్టీకి చెందిన అన్ని కమిటీలు రద్దు చేస్తామని, పూర్తిస్థాయిలో మళ్లీ పున:నిర్మాణ దిశగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఫిబ్రవరి రెండోవారంలో నిజామాబాద్‌లో భారీ బహిరంగ జరుగుతుందని అన్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్త బస్సుయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ యాత్ర ఇంటింటికి చేపడతామన్నారు. టీడీపీ బలాన్ని చూసి సీఎం కేసీఆర్‌కు వణుకు పుట్టి ఢిల్లీ సభను ఖమ్మంకు మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. ఈనెల 18న ఎన్టీఆర్ వర్థంతి రాష్ట్ర వ్యాప్తంగా భారీస్థాయిలో నిర్వహించాలని చెప్పారు. పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వివేకానంద బోధనలే టీడీపీ సిద్దాంతాలని చెప్పారు. స్వామీజీ మార్గంలోనే ఎన్టీఆర్, చంద్రబాబు పరిపాలన సాగిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.జ్యోత్స, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్లూరి రామారావు పాల్గొన్నారు.