Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ పనులను తప్పించకపోతే 18 నుంచి సమ్మె
- ఎన్హెచ్ఎం రెండో ఏఎన్ఎంల యూనియన్ ధర్నాలో వక్తలు
నవతెలంగాణ - అడిక్మెట్
రెండో ఏఎన్ఎంలు అనేక రాష్ట్రాల్లో పర్మినెంట్ అయినప్పటికీ.. మిగులు బడ్జెట్ గల తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పర్మినెంట్ కాకపోవడం అన్యాయమని, వెంటనే క్రమబద్ధీకరిం చాలని వక్తలు డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర ఎన్హెచ్ఎం రెండో ఏఎన్ఎంల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాకు ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు, సెకండ్ ఏఎన్ఎంల యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామాంజనేయులు అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసుఫ్, ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కష్ణయ్య మాట్లాడారు. సంవత్సరాల తరబడి ఎన్హెచ్ఎం స్కీంలో రెండో ఏఎన్ఎంలుగా సేవలందిస్తున్న సిబ్బందిని బేషరతుగా క్రమబద్ధీకరిం చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిం చకుండా ఆ పనులను రెండో ఏఎన్ ఎంలతో చేయించుకునేందుకు ప్రయత్ని స్తున్నదని.. ఇది అన్యాయమన్నారు.
కరోనాలాంటి వ్యాధులు ప్రబలి నప్పుడు సైతం ఏఎన్ఎంలు మారు మూల ప్రాంతాల్లో ప్రజానీకానికి సేవలు అందించారని గుర్తు చేశారు. ఏఎన్ఎంల సేవలను మాటల్లో పొగు డుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరి స్తున్నదని అన్నారు. వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కంటి వెలుగు ప్రోగ్రాం ఆన్లైన్ పనుల నుంచి ఏఎన్ ఎంలను తప్పించకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో 18వ తేదీ నుంచి నిరవధిక సమ్మె, ఆందోళన కార్యక్రమాలకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రెండో ఏఎన్ ఎంల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మధురిమ, రాష్ట్ర కార్యదర్శి పడాల మమత, రేణుక, మంజుల, నీలిమ, సజన, విజయ వాణి, విజ యలక్ష్మి, స్వర్ణలత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, దీపిక బిల్లా తదితరులు పాల్గొన్నారు.