Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలి
- టీఎస్‌యూటీఎఫ్ నాయకులు మాణిక్‌రెడ్డి
- సీపీఎస్ రద్దు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలి : సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గాభవాని
- నేటి నుంచి యూటీఎఫ్ రాష్ట్ర 5వ మహాసభ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
''విద్య దేశ ప్రగతికి తొలి మెట్టు.. జాతీయ నూతన విద్యావిధానంతో పేద విద్యార్థులకు విద్య దూరమయ్యే ప్రమాదం ఉంది.. కుల, మత, భాషల వైషమ్యాలతో విద్యారంగం భ్రష్టు పడుతోంది.. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలి'' అని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు మాణిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయం జాల్లో ఈ నెల 13, 14వ తేదీల్లో జరగనున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర 5వ మహాసభ సందర్భంగా గురువారం ఆహ్వాన సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా మాణిక్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తుంటే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో మూఢత్వ భావజాలాన్ని, మతతత్వాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లను బలహీనపరుస్తూ విద్యారంగాన్ని వ్యాపార రంగంగా మార్చేందుకు సాహసోపేతమైన ప్రయ త్నాలు చేస్తున్నాయన్నారు. చైనా, అమెరికా విధా నాలు విభిన్నమైనప్పటికీ.. విద్యారంగంలో అవలం బిస్తున్న విధానాలు ఒకే విధంగా ఉన్నాయని చెప్పారు. విద్యారంగంతోనే దేశ ప్రగతి ముడిపడి ఉంటుందని.. అందువల్ల ఈ రంగాన్ని ఎంత పటిష్టం చేసుకుంటే దేశ ప్రగతి అంత ముందుకు దూసుకుపోతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉపా ధ్యాయ పోస్టుల ఖాళీలతో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. 28 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా యన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపా ధ్యాయుల సమ స్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుం దన్నారు. రాష్ట్ర మహాసభలో ప్రధానంగా ఉపా ధ్యాయ సమస్యలపై, విద్యారంగంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న మార్పులపై, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామన్నారు. భవిష్యత్ కార్యాచరణకు దిశా నిర్దేశం చేసే విధంగా మహాసభ ఉపయోగపడనుందని తెలిపారు.
రాష్ట్ర కార్యదర్శి దుర్గాభవాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేసి శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగాల నియామకాలు చేపట్టాలన్నారు. గురుకులాల్లో 56 శాతం గెస్ట్ ఫ్యాకల్టీలతో నడుస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిం చేందుకు దిశా నిర్దేశాన్ని చూపే విధంగా మహాసభ ఉండబోతుందని స్పష్టం చేశారు. 650 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశాల్లో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమా వేశంలో టీఎస్‌యూటీఎఫ్ నాయ కులు నరసింహా రావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాల్‌నాయక్, వెంకటప్ప, రాష్ట్ర కార్యదర్శులు వెంకటి, గాలయ్య, శాంతికుమారి, శ్రీధర్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాములయ్య, కల్పన తదితరులు పాల్గొన్నారు.