Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ నేతలకు ఠాక్రే హితవు
- 21న మళ్లీ వస్తానని వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎన్నికల సంవత్సరమైన 2023 పార్టీకి ఎంతో కీలకమనీ, అందువల్ల అందరూ సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే హితవు పలికారు. రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశాల అనంతరం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, బోసురాజుతో కలిసి ఠాక్రే విలేకర్లతో మాట్లాడారు. రెండురోజులపాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిణామాలపై చర్చించినట్టు తెలిపారు. సీనియర్లతోసహా అందరూ కలిసికట్టుగా పని చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. భారత్ జోడో యాత్ర పూర్తయ్యాక కొనసాగింపుగా దేశంలో హాత్ సే హాత్ జోడో యాత్ర జనవరి 26 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. ఆ యాత్ర జయప్రదం కోసం రెండునెలలపాటు కష్టపడాలని సూచించారు. యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు పాల్గొనాలని కోరారు.
ఎన్నికలకు సమాయత్తం చేసేందుకే : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకే ఠాక్రే రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇది ఎన్నికల సంవత్సరమనీ, అందుకే కొత్త ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆయన...పార్టీ నేతలతో వరుసగా రెండు రోజులపాటు సమావేశమయ్యారని తెలిపారు. ముంబయి బాంబు బ్లాస్ట్ ఘటన, ఆ సమయంలో నెలకొన్న మత కల్లోలాలను ఆనాటి హోంమంత్రిగా ఠాక్రే సమర్థవంతంగా నిలువరించారని గుర్తు చేశారు. సమస్యలను పరిష్కరించడంలో ఠాక్రే తనదైన శైలిని ప్రదర్శిస్తారనే గుర్తింపు ఉందన్నారు.
ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగించండి
టీఎస్పీఎస్సీ చైర్మెన్‌కు కాంగ్రెస్ వినతి
జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల దరఖాస్తులకు గడువును పొడిగించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు కోటూరి మానవతరారు, చారుకొండ వెంకటేష్ కోరారు. ఈమేరకు గురువారం హైదరాబాద్‌లో టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్ధన్‌రెడ్డికి వారు వినతిపత్రం సమర్పించారు. ఆన్లైన్ దరఖాస్తుల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్య కారణంగాఅభ్యర్థులు ఈనెల 10లోగా దరఖాస్తులు సమర్పించలేక పోయారని వివరించారు.
సుప్రీం కోర్టు నోటీసు పట్ల పొన్నం హర్షం
ఓబీసీ కుల గణనను చేపట్టాలంటూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం పట్ల మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి కుల గణనను వెంటనే చేపట్టాలని ఒక ప్రకటనలో కోరారు.