Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుది రాత పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షల నేపథ్యంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులను చేస్తున్నట్టు రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ వి.వి శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మార్చి 12న జరగాల్సిన ఎస్సై (ఐటీ), ఏఎస్ఐ (ఫింగర్ ప్రింట్స్ బ్యూరో) తుది రాతపరీక్షను ఒక రోజు ముందు 11వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గతంలో ప్రకటించిన విధంగానే పరీక్షా సమయం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే, ఏప్రిల్ 23న జరగాల్సిన సివిల్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు జరగాల్సిన పరీక్షను 30వ తేదీన జరపనున్నట్టు ఆయన చెప్పారు. ఈ పరీక్షకు సైతం పరీక్షా సమయం గతంలో ప్రకటించిన విధంగానే ఉంటుందని తెలిపారు. టీఎస్పీఎస్సీ పరీక్షలకు హాజరుకావడానికి గానూ అభ్యర్థులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు.