Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీయూ టీఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చరిత్రలో ఎప్పుడూ లేనివధంగా ఎస్సెస్సీ పరీక్షల్లో వంద శాతం ఫలితాలు 10 బై 10 జీపీఏలు కచ్చితంగా సాధించాల్సిందేనని, లేనిపక్షంలో తీవ్రమైన చర్యలుంటాయని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను బెదిరిస్తున్న కలెక్టర్లు, అధికారులు తమ తీరును మార్చుకోవాలని ఎస్టీయూ టీఎస్ హెచ్చరించింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.సదానందం గౌడ్, ఎం.పర్వత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి బెదిరింపులతో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారనీ, వారిని మనశ్శాంతితో బతకనివ్వరా? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల నుంచి ముందస్తు హామీ పత్రాలు తీసుకోవడం ఏ విధానమో చెప్పాలని ప్రశ్నించారు. అలాంటి హామీ పత్రాలు అడుగుతున్న అధికారులు తమ శాఖాపరమైన పనుల్లో అలాగే ఉన్నారా? లేకుంటే వారిపై చర్యలు తీసుకోవచ్చని ముందస్తు లేఖలిచ్చేందుకు సిద్ధమేనా? అని సవాల్ చేశారు.