Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బెంగళూరు మెట్రో పిల్లర్ కూలి యువతితో పాటు ఆమె బిడ్డ కూడా దుర్మరణం చెందిన ఘటనకు కేంద్ర ప్రభుత్వంతో పాటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) డిమాండ్ చేసింది. ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మయ్య ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షలు నష్టపరిహారం ప్రకటించి తన బాధ్యత నుండి తప్పించుకోజాలదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కోకాపేట వంతెన, గుజరాత్‌లోని వైరువంతెన, ఇటీవలి బెంగుళూరు మెట్రో పిల్లర్ బ్రిడ్జీల ప్రమాదాలు ప్రభుత్వాల నిర్లక్ష్యాలకు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయని ఆక్షేపించారు. లాభాపేక్షే పరమావదిగా భావించిన కంపెనీల అత్యావే దీనికి కారణమని స్పష్టం చేశారు. టెండర్ నాణ్యత, ఇతర ప్రమాణాలు గాలికి వదిలేసి ప్రజలను బలి చేస్తున్నారని విమర్శించారు. నిర్మాణ ప్రతి దశలో ఇంజనీర్ల పర్యవేక్షణ కొరవడింది. మెట్రో నిర్మాణ పనుల ఆర్డర్‌ను రద్దు చేసి, ఆసంస్థను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యాన్ని ప్రాసిక్యూషన్ చేయాలని కోరారు.