Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ను అక్కడి ప్రజలు నమ్మరు : కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు స్థానం లేదనీ, ఎప్పుడో కాంగ్రెస్కు ఖరారయ్యాయంటూ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు స్టార్ క్యాయింపెనర్లుగా మారి కాంగ్రెస్కు ఆరు సీట్లలో గెలిపించారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ నేతలు మానవతారారు, కల్వసుజాతతో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చే మిరపకాయకో, కేసీఆర్ ఇచ్చే సొరకాయకో ఖమ్మం ప్రజలు ఆశపడట్లేదని వివరించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 10 మంది ఎమ్మెల్యేలు, రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపారు.