Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఎ.శాంతి కుమారి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా టీఎన్జీవో కేంద్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర తొలి మహిళా సీఎస్ శాంతి కుమారిని ఆ సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకాంటి ప్రతాప్ నేతత్వంలో నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ తమ పదవీ కాలంలో విజయవంతంగా పని చేస్తారనీ, రాష్ట్ర అభివద్ధిలో ఆమె సేవలు మరింతగా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎస్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో సంఘం అసోసియేట్ అధ్యక్షులు: కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ముజీబ్, విక్రమ్, రంగారెడ్డి జిల్లా నుంచి లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, నగర శాఖ నుంచి శ్రీరామ్,శ్రీకాంత్, మెడ్చల్ జిల్లా నుంచి రవి ప్రకాష్ తో పాటు కేంద్ర సంఘం నేతలు, కొండల రెడ్డి, చందు, ఉమ దేవి, శైలజ, శ్రీనివాస్ గౌడ్, ఆంజనేయులు తదితరులున్నారు.
నిఖత్ జరీనకు సీఎస్ శుభాకాంక్షలు
అర్జున అవార్డు గ్రహీత, ప్రపంచ మహిళల జూనియర్ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్కె భవన్లో నిఖిత్ జరీన్ సీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నిఖిత్ జరీనకు రాష్ట్ర క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అభినందనలు తెలిపారు.