Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 1,70,000 సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాల సామాజిక భద్రత గురించి ఆమె దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం జరిగిన హిమాచల్‌ప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్‌లో ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు, రాష్ట్ర అసోసియేట్ కోటకొండ పవన్ కుమార్, సాయిలు పాల్గొన్నారు.