Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొప్ప పరిపాలనా దక్షకుడు : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఒక వ్యక్తి కాదు..శక్తి అని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చినా ఆయన కోరుకున్న ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కులోని మర్రి చెన్నారెడ్డి రాక్గార్డెన్లో ఆయన 103వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. చెన్నారెడ్డి విగ్రహానికి కిషన్రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆయన గొప్ప పరిపాలనా దక్షకుడు అని కొనియాడారు. ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ..ప్రజా తెలంగాణ కోసం మరో ఉద్యమం అవసరమని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో ఫ్యూడల్ పాలనకు అంతం పలకాలన్నారు. ప్రజలు మెచ్చే పాలన తెలంగాణలో రాబోతున్నదని చెప్పారు.