Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బండి సంజయ్ మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి తెలిపారు.శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంపై విమర్శలు చేస్తే బండి పోటుగాడు అవుతాడా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్న తీరుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేయటం లేదని తెలిపారు. వాస్తవాలను గుర్తించలేని స్థితిలో బీజేపీ ఉందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల పట్ల బీజేపీ కేంద్ర మంత్రులే కితాబులిస్తున్నారని గుర్తుచేశారు. అధికారం కోసం బీజేపీ నాయకులు నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పటం తగదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పంజరంలో చిలుకలుగా ఉన్నాయని చెప్పారు. ఈ దేశానికి పట్టిన చీడ బీజేపీనని విమర్శించారు. తెలంగాణ అప్పుల గురించి పార్లమెంట్లో బండి సంజరు ఎందుకు ప్రస్తావించటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాభివృ ద్ధిని అడ్డుకోవటమే బీజేపీ టార్గెట్‌ని చెప్పారు.