Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్వరలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. శుక్రవారం ప్రొగ్రెసివ్ రికగ్నైజ్ డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సంఘం 2023 డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పలు యాజమాన్యాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ బదిలీలు, పదోన్నతులు సంక్రాంతి కానుకగా అందించాలని సీఎం కేసీఆర్ను కోరినట్టు మంత్రి వెల్లడించారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం, త్వరలో షెడ్యూల్ విడుదల చేయనున్నారని హరీశ్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘ అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నాయకులు మధు, రంగారావు, తిరుపతిరెడ్డి, వెంకటేశ్వరరావు, రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.