Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యూనివర్సిటీల తప్పులకు విద్యార్థులు శిక్ష ఎందుకు అనుభవించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రశ్నించింది. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మంజూర్ హుస్సేన్ ఆన్లైన్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. నీట్ ఎండీఎస్ 2023 కోసం బీడీఎస్ ఇంటర్నీల గడువును మార్చి 31 తర్వాత కూడా పొడిగించాలని కోరారు. ఇదే డిమాండ్‌తో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ప్రతి రాత్రి 11 గంటల నుంచి 3.15 గంటల వరకు సామూహిక డిమాండ్‌తో ప్రతి ఒక్కరు ట్వీట్ చేయాలని పిలుపునిచ్చారు.