Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరెంటు వైర్లు చూడండి...
- టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి హెచ్చరికలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పతంగులు ఎగరేసేటప్పుడు పిల్లలు, పెద్దలు కరెంటు లైన్లు, స్తంభాలతో జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, సబ్స్టేషన్లకు దూరంగా, బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని సూచించారు. పతంగులు, మాంజాలు విద్యుత్ లైన్లపై పడితే విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు ప్రమాదాలు జరిగే అవ కాశం వున్నదని తెలిపారు. కాటన్, నైలాన్, లెనిన్తో చేసిన మాంజాలను మాత్ర మే వాడాలని సూచించారు. మెటాలిక్ మాంజాలు విద్యుత్ వాహకాలు కనుక అవి లైన్లపై పడ్డప్పడు విద్యుత్ షాక్ కలిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. పొడి వాతావరణంలో మాత్రమే పతంగులు ఎగురవేయాలనీ, బాల్కనీ, గోడల మీది నుంచి పతంగులు ఎగురవేయోద్దని చెప్పారు. పతంగులు ఎగరే సేటప్పుడు పెద్దలు పిల్లల్ని గమనించాలనీ, తెగిన, కింద పడ్డ విద్యుత్ వైర్లను తాకనివ్వొద్దని పేర్కొన్నారు. ఎలాంటి ఫిర్యాదు అయినా విద్యుత్ శాఖ వారి 1912కి, లేదా సమీప విద్యుత్ కార్యాలయంలో, లేదా సంస్థ మొబైల్ ఆప్, వెబ్సైట్ www. tssouthernpower.com ద్వారా తెలపాలని కోరారు.