Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15న ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందించే వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలి రైలును ఈనెల 15న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు వారంలో 6 రోజులు నడుస్తుంది. ఆ రోజు రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ఆ రైలును ప్రారంభిస్తారు. రైలు సాధారణ సేవలు ఈనెల 16 నుంచి ప్రారంభమవుతాయనీ, టిక్కెట్ బుకింగ్లు శనివారం నుంచి ఉంటాయని తెలిపారు. ట్రైన్ నంబర్ 20833 విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉదయం 05.45 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుం ది. అలాగే 15వ తేదీ ప్రారంభమయ్యే రైలు నంబర్ 20834 సికింద్రాబాద్ - విశాఖపట్నం రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి సాయం త్రం 8.45 గంటలకు విశాఖపట్నం చేరు కుంటుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ వంటి ప్రధాన స్టేషన్లతో పాటు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట్, మహబూబాబాద్, డోర్నకల్, మధిర, కొండపల్లి, విజయ వాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో రైలు రెండు వైపులా ఆగుతుంది.