Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు టీఎస్పీఎస్సీ శుక్రవారం ఫలితాలను ప్రకటించింది. గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జూన్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. మెయిన్స్ పరీక్ష విధానం ఈ నెల 18న వెల్లడించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టినట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. మల్టీ జోన్, రిజర్వేషన్ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సంక్రాంతి పండుగకు ముందే ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.