Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫొటోలు తీసి బ్లాక్మెయిల్
- ఇద్దరు నిందితుల అరెస్ట్
నవతెలంగాణ-కంటోన్మెంట్
హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. జిమ్‌కు వచ్చిన బాలికపై ట్రైనర్లు వేధింపులకు గురిచేయడమే కాకుండా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. బోయిన్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఓ బాలిక ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే, ఆమె ఫిట్నెస్ కోసం ఫిట్నెస్ అర్ జోన్ వ్యాయామశాలకు వెళ్లేది. ఈ క్రమంలో ట్రైనర్ రాజు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. బాలిక వర్కవుట్స్ చేస్తుండగా ఆమెతో సన్నిహితంగా ఉంటూ, శరీర భాగాలను తాకుతూ ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం మరో ట్రైనర్ రవితో కలిసి ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసి బాలికను బెదిరించారు. 20 తులాల బంగారం, రూ. 4 లక్షలు ఇవ్వాలని వేధించారు. దాంతో బాలిక ఆందోళనకు గురైంది. అది గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా.. విషయం చెప్పింది. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.