Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్‌కు వీఆర్ఏల జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని వీఆర్ఏ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని వీఆర్ఏ జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శభాకాంక్షలు తెలిపారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వీఆర్ఏలకు తక్షణమే పేస్కేలు ఇవ్వాలని కోరారు. అర్హులైనవారందరికీ ప్రమోషన్లు కల్పించాలనీ, వారసత్వ ఉద్యోగాలివ్వాలని విన్నవించారు. 80 రోజుల సమ్మె కాలపు వేతనాలను ఇవ్వాలనీ, సమ్మె కాలంలో పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మెన్ రాజయ్య, కోచైర్మెన్ రమేశ్ బహదూర్, కన్వీనర్ సాయన్న, కో కన్వీనర్లు వంగూరు రాములు, మాధవనాయుడు, గోవింద్, తదితరులు పాల్గొన్నారు.