Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ క్యాలెండర్, డైరీని శుక్రవారం హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఈ. గంగాధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రతిఏటా భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో డైరీ, క్యాలెండర్ తీసుకురావటం మంచి పరిణామం అని కొనియాడారు. సంక్షేమ బోర్డులో కార్మికులు రిజిస్ట్రేషన్ చేయుంచుకోవటమెలా? అందులో ఉన్న ప్రయోజనాలేంటి? కార్మిక శాఖ జీవోలు, తదితర సమాచారంతో డైరీ వేసిన ఫెడరేషన్‌కు అభినందనలు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులందరూ డైరీ, క్యాలెండర్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు వంగూరు రాములు, అధ్యక్షులు ఎస్.రామ్మోహన్, రాష్ట్ర నాయకులు పి.పుల్లారావు పాల్గొన్నారు.