Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్ రాజీనామా లేఖ రాసుకొని రావాలి : కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి స్పష్టం చేశారు. శనివారంనాడిక్కడి బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర నిధులపై చర్చకు రావాలంటూ మంత్రి కే తారకరామారావు చేసిన సవాలును తాను స్వీకరిస్తున్నట్టు చెప్పారు. అయితే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రాజీనామా పత్రాన్ని తీసుకొని, మంత్రి కేటీఆర్ చర్చకు రావాలని షరతు విధించారు. భారతదేశం అఫ్గానిస్థాన్గా మారుతుందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని అన్నారు. రాజకీయంగా తమను తిడితే పడతామనీ, దేశాన్ని నిందిస్తే సహించబోమని హెచ్చరించారు.