Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లూధియానా : జోడోయాత్రలో విషాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం పంజాబ్‌లోని జోడోయాత్రలో పాల్గొన్న జలంధర్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి (76) గుండెపోటుతో కన్నుమూశారు. వివరాల్లోకి వెళి తే.. ఈరోజు ఉదయం పంజాబ్‌లోని ఫిలింనగర్లో జరుగుతున్న జోడో యాత్రలో ఎంపీ సంతోఖ్‌సింగ్ పాల్గొన్నారు. పాదయాత్రలో నడుస్తుండ గా.. గుండెపోటుకు గురై కుప్పకూలారు. వెంటనే హుటాహుటిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆయన్ని ఫగర్వాలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ కూడా ఆస్పత్రికి చేరుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. సంతోఖ్‌సింగ్ ఆకస్మిక మృతి వల్ల జోడోయాత్రను ప్రస్తుతానికి నిలిపి వేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సంతోఖ్‌సింగ్ మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సంతాపం తెలిపారు. చౌదరి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఖర్గే ట్వీట్ చేశారు.