Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో అనందపు సిరులు కురిపించాలని ఆకాంక్షించారు.
చౌదరి సంతోఖ్ సింగ్కు నివాళులు
కాంగ్రెస్ పార్టీ జలంధర్ ఎంపీ చౌదరీ సంతోఖ్ సింగ్ పార్ధీవ దేహానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. భారత్ జోడో యాత్రలో గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిన వెంటనే రేవంత్ హుటాహుటీన పంజాబ్ బయలుదేరి వెళ్లారు. సంతోష్ సింగ్ చౌదరి కుమారుడు విక్రమ్ సింగ్ చౌదరీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుటుంబానికి తన సానుభూతిని తెలిపారు.