Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటి నుంచి 20 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ సమ్మిట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సోమవారం నుంచి 20వ తేదీ వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ సమ్మిట్‌కు మంత్రి కే తారకరామారావు నేతృత్వంలోని ప్రతినిధిబృందం హాజరుకానుంది. శనివారం రాత్రి ఈ బృందం అక్కడకు బయల్దేరి వెళ్లింది. ఈ సమ్మిట్‌కు హాజరుకావాలని ఫోరం అధ్యక్షులు బోర్గ్ బ్రెండే పంపిన ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలోని పలు పెట్టుబడిదారీ సంస్థలన్నీ ఇక్కడ వ్యాపార విస్తరణ ప్రణాళికలతో వస్తాయి. వాటితో మాట్లాడి రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం పనిచేస్తుంది. మంత్రి వెంట వెళ్లే బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఆటోమోటివ్స్ డైరెక్టర్ గోపాల్‌కృష్ణన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ఉన్నారు.