Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్, చీటి భూపతిరావు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం సీపీఎస్‌ను రద్దు చేయటం లేదని తెలిపారు. రాష్ట్రంలో సీపీఎస్‌ను ఓపీఎస్‌గా మార్చాలనీ, రెండు లక్షల మంది ఉపాధ్యాయులు,ఉద్యోగులు ఎదురుచూస్తునారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 16 సోమవారహైదరాబాద్లో సీపీఎస్ ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.