Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మారిషస్‌లో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ హాజరుకానున్నట్టు మారిషస్ తెలుగు మహాసభ సంఘం, తెలుగు కల్చరల్ ట్రస్ట్, తెలుగు స్పీకింగ్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు. మారిషస్ తెలుగు మహాసభ ఏర్పడి 75ఏండ్లు పూర్తయిన సందర్భంగా రూపొందించిన లోగోను శనివారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా ప్రతినిధులు మాట్లాడుతూ మారిషస్ లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిద్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఆహ్వానించినట్టు తెలిపారు. అక్కడ స్థిరపడిన తెలంగాణ ప్రజల కోసం సాంస్కృతిక, పర్యాటక, విద్యా అవకాశాలపై పరస్పర సహకారం అందించాలని కోరారు. వారి విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ ప్రతినిధి విశ్వకర్మ, బాలరాజ్ పెంటయ్య, ధరంరాజ్ నారాయణస్వామి, గురయ్య, రాజేంద్ర అప్పాలస్వామి, తెలుగు విద్యాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.