Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అదుపులో ఐదుగురు
నవతెలంగాణ-వనస్థలిపురం
ప్రమాకరమైన చైనా మాంజాలను అమ్ముతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఐదుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 వేల మాంజాలను స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురం సీఐ కె.సత్యనారాయణ తెలిపిన వివరాలు ప్రకారం.. నాగోల్ జైపూర్ కాలనీకి చెందిన కబీర్ రాజ్, విజయపురి కాలనీకి చెందిన దినేష్, మారుతినగర్‌కు చెందిన రజిని, బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన అఫ్రీజ్, వనస్థలిపురం కాంప్లెక్స్‌కు చెందిన మౌనిద్దీన్ చైనా మాంజాలను అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మాంజాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని సీఐ అభినందించారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం హైదరాబాద్ నాగోల్‌లో బైక్‌పై వెళ్తున్న చిన్నారికి మాంజా తగిలి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అలాగే, సంగారెడ్డి జిల్లా జోగుపేటలో బైక్‌పై వెళుతున్న యువకుడికి చైనామంజా తగిలి గాయపడ్డారు.