Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.4.50లక్షలకు అమ్మిన నిందితులు
- కేసును ఛేదించిన భద్రాచలం పోలీసులు
- బాలుడిని తల్లికి అప్పగింత
- కిడ్నాపు ఘటనలో ఆరుగురు నిందితుల అరెస్ట్
- వివరాలు వెల్లడించిన భద్రాచలం ఏఎస్పీ
నవతెలంగాణ-భద్రాచలం
బాలుడి కిడ్నాప్ కేసును భద్రాచలం పోలీసులు ఛేదించారు. రూ.4.50కు అమ్మిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. భద్రాచలానికి చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడు జనవరి 6వ తేదీన కిడ్నాప్ అయ్యాడు. తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా విచారించగా పలు విషయాలు వెలుగుచూశాయి. భద్రాచలం పట్టణం అశోక్‌నగర్ కాలనీకి చెందిన కందుల అన్నపూర్ణ, ఆమె రెండో కూతురు అనూష, కొడుకు సాయిరాం తదితరులు డబ్బుపై అత్యాశతో భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో బాలుడిని కిడ్నాప్ చేసి అమ్మా లని పథకం రచించారు. ఈ క్రమంలో వారు రాజ మండ్రికి చెందిన బెండ తులసి ద్వారా డా.స్నేహలత, ఇసాక్‌కు బాలున్ని అమ్మేందుకు రూ.4.50కు డీల్ కుదుర్చుకున్నారు. కందుల అన్నపూర్ణ, కూతురు అనూష, సాయిరాం కొంత కాలంగా ఆ బాలుడిని మచ్చిక చేసుకున్నారు. అతని ఫొటోలను డా.స్నేహ లత, ఇసాక్ దంపతులకు పంపారు. వారి పథకంలో భాగంగా డిసెంబర్ 22న బాలున్ని రాజమండ్రి తీసుకెళ్లి.. అదే రోజు భద్రాచలం తీసుకొచ్చారు. అనంతరం జనవరి 6వ తేదీన నిందితులు ముగ్గురూ కలిసి బాలున్ని కిడ్నాప్ చేసి రాజమండ్రి తీసుకెళ్లారు. బెండ తులసి ద్వారా డా.స్నేహలత, ఇసాక్ దంపతు లకు బాలుడిని రూ.4.50 లక్షలకు అమ్మారు. అందు లో బెండ తుల సికి రూ.50,000 ఇచ్చారు. జనవరి 14 ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు కందు ల అన్నపూర్ణ, అనూష, సాయిరాంను భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరా న్ని అంగీకరించారు. వారు తెలిపిన వివరాల ప్రకా రం.. డా.స్నేహలత, ఇసాక్, బెండ తులసిని అదుపు లోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.3.10 లక్షలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చైల్డ్ లైన్, డీసీపీ యూనిట్ భద్రాద్రి కొత్తగూడెం అధికారుల సమక్షంలో బాలున్ని తల్లికి అప్పగించి నట్టు ఏఎస్పీ వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపుతామన్నారు.