Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండ్రోజుల్లో హైదరాబాద్-విజయవాడకు 1.24 లక్షల వాహనాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సంక్రాంతి పండుగ సందర్భంగా కేవలం రెండ్రోజుల్లో హైదరాబాద్- విజయవాడ రూట్లోని పంతంగి టోల్‌ప్లాజా నుంచి 1.24 లక్షల వాహనాలు వెళ్లాయి. జనవరి 12న 56,500 వాహనాలు, 13న 67,500 కార్లు వెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. టోల్‌ప్లాజా వద్ద కిలోమీటరుకు పైగా వాహనాలు బారులు తీరాయి. పండుగ సందర్భంగా 90శాతం మంది వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణం చేసినట్టు అధికారులు చెప్పారు. రెండ్రోజుల్లో 98వేలకు పైగా కార్లు హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ గేట్ మీదుగా విజయవాడ వెళ్లినట్లు పోలీసుల లెక్కల్లో తేలినట్టు వివరించారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బీబీనగర్ టోల్ గేట్ మీదుగా శుక్రవారం 26వేల వాహనాలు వెళ్లగా, వాటిలో 18వేల కార్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు 13వేలకు పైగా వాహనాలు వచ్చినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ సరిహద్దుల్లోని చౌరస్తాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. టోల్ గేట్ల వద్ద ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక మార్గాన్ని కేటాయించారు.